విశాలాంధ్ర- దేవరపల్లి-:రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ నందు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో దేవరపల్లి మండలానికి చెందిన మానవత సభ్యులు బలుసు సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులకు 2025-26 సంవత్సరం లో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ప్రశంస పత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక మరియు సినిమా టోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి చేతుల మీదుగా ప్రధానం చేసినారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమి వీర్రాజు, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, టిటీడి బోర్డు సభ్యులు అక్కిన ముని కోటేశ్వరావు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మరియు జిల్లా అధికారులు, ప్రతినిధులు మానవతా సభ్యులు అభినందనలు తెలియజేసినారు
విశిష్ట సేవలకు దంపతులకు ప్రశంసా పత్రం
- Advertisement -
RELATED ARTICLES


