ఫలితాలను విడుదల చేస్తున్న పరీక్షల విభాగాధిపతి
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం బీ.ఫార్మసీ,ఫార్మా.డి , బి బి ఏ పరీక్ష ఫలితాలును మంగళవారంఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య ఆదేశాలతో పరీక్షల విభాగాధిపతి నాగ ప్రసాద్ నాయుడు విడుదల చేశారు. బీ.ఫార్మసీ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్19) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు, ఫార్మా.డి. మూడవ సంవత్సరం (ఆర్17) రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ, బి బి ఏ ఒకటవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్24) రెగ్యులర్, ఒకటవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్ (ఆర్24) సప్లిమెంటరీ ఫలితాలు మరియు ఎమ్మెస్సీ. నాలుగవ సెమిస్టర్ (ఆర్21) రెగ్యులర్ , సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఫలితాల విడుదలలో కంట్రోలర్ అఫ్ ఎక్సామినేషన్ ఆచార్య ఎ.పి. శివ కుమార్ అడిషినల్ కంట్రోలర్స్ ఆచార్య జి.శంకర్ శేఖర్ రాజు , డాక్టర్ శ్రీధర్ , డాక్టర్ ఎం. అంకారావు పాల్గొన్నారు.


