Homeజిల్లాలుఅనంతపురంమాదక ద్రవ్యాల నిర్మూలనకు అడుగుల వేద్దాం...సబ్ ఇన్స్పెక్టర్ హనుమంత్

మాదక ద్రవ్యాల నిర్మూలనకు అడుగుల వేద్దాం…సబ్ ఇన్స్పెక్టర్ హనుమంత్

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి విద్యార్థి అడుగులు వేయాలని అని ఈగిల్ క్లబ్ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంత్ పేర్కొన్నారు.మంగళవారం బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని సూచించారు.కళాశాల చైర్మన్ డా. పల్లె కిషోర్ మాట్లాడుతూ .. “మాదకద్రవ్యాలు దేశ భవిష్యత్తును నాశనం చేస్తాయి. యువత శక్తిని దేశ అభివృద్ధికి వినియోగించాలి. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకుని, ఇతరులకు కూడా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. ప్రదీప్ కుమార్ , ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డి. వెంకట నారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు