ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సన్నాహాలు
– అరకొర వసతుల తోనే ప్రజలకు వైద్య సేవలకు అధికారాలు స్పందన
విశాలాంధ్ర – సీతానగరం : ప్రతి పేదోడికి కూడు,గూడు, గుడ్డ సమకూరినపుడే సంపూర్ణ స్వరాజ్యం సిద్ధిస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీ అజెండాగా సాగుతూ వస్తుంది.దీనికి తోడు ఎన్డీఏ కూటమి కలయికతో పేదోడి కి సరైన వైద్య సేవలంటూ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టింది. ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి వైద్యసేవలు సక్రమంగా అందించాలని మండల ప్రజలు కోరారు. సీతానగరం మండలంలోని 23 గ్రామాలకు సంబంధించి సుమారు 80 వేల జనాభాకు ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పి హెచ్ సి) ద్వారా ఇప్పటి వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీనిపై అరకొరక వసతులతోనే ప్రజలకు వైద్య సేవలంటూ ఇటివలే విశాలాంధ్ర దినపత్రికలో వెలువడిన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు స్పందించారు. ఇందుకు సంబంధించి స్తానిక విశాలాంధ్ర ప్రతినిధికి లేఖ పూర్వకంగా వివరణ అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీతానగరం పిహెచ్ సి లో వర్షపు నీరు కారుతున్న విషయం వస్తమేనని, దీనిపై ఇప్పటికే మరమ్మత్తులు చేపట్టామని,అయితే అవి విఫలం చెందాయన్నారు. కాగా ఇప్పటికే నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ,జిల్లా కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకువెళ్ళమని చెప్పారు.మరోసారి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సన్నాహాలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే గర్భిణి స్త్రీలు స్తానిక పిహెచ్ సి లో ప్రసవించిన సమయం లో అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందిస్తున్నామని తద్వారా అన్ని రకాల ఆరోగ్య సంరక్షణ సేవలు అందించిన తర్వాతే డిశ్చార్జ్ చేస్తునట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ డిఎంహెచ్వో పి హెచ్ సి నీ సందర్శించి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్టోర్‌లోని మందులను ఏ ఎన్ ఎమ్ సెంటర్ కి తరలించినట్లు తెలిపారు.


