విశాలాంధ్ర పుట్టపర్తి:– ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఉత్తర్వుల మేరకు పుట్టపర్తి రూరల్ పరిధిలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి విజయ్ కుమార్ మాట్లాడుతూఎక్కడైనా ఎవరైనా గొడవలు, దౌర్జన్యాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాల్సిన భాద్యత ప్రజల పై ఉందన్నారు.పోలీసులకు సమాచారం అందిస్తే విచారణ చేస్తామన్నారు.
ఎవరైనా గంజాయి, అక్రమ మద్యం, వంటివి విక్రయాలు చేసినా , గొడవలు పడినా పోలీసులకు దృష్టి కి తీసుకురావాలన్నారు. అందరూ కలిసిమెలిసి జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సురేష్, ఎస్సైలు లింగన్న, కృష్ణమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చట్టవ్యతిరేక కార్యకలపాలకు దూరంగా ఉండండి..
- Advertisement -
RELATED ARTICLES


