విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని అధిక వడ్డీ, అక్రమ వడ్డీ వ్యాపారం, ఇన్షాత్మక కేసుల్లో ప్రధాన నిందితుడైన సాకే రాజశేఖర్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి హేమంత్ కుమార్ కేసు వివరాలను తెలియజేశా రు. అనంతరం డిఎస్పి మాట్లాడుతూ ధర్మవరము పరిసర ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ, వడ్డీ చెల్లించని వారిని తన గుంపుతో కలిసి బెదిరించడం, దాడులు చేయించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి హింసాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. సాకే రాజశేఖర్ను పట్టణంలోని రైల్వే స్టేషన్ కొత్తపేట ఆర్చ్ వద్ద అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుడు రాజశేఖర్ పట్టణంలోని ఎల్సికేపురం లో వడ్డీ వ్యాపారం చేసేవారని తెలిపారు.జూలై 23వ తేదీ పట్టణంలోని శాంతినగర్ లోని దేవరశెట్టి భారతి ఇంటిపై నిందితుడు సాకే రాజశేఖర్ తన సహచరులతో కలిసి దాడి చేసి బాధిత కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించి రూ.7,000 బలవంతంగా వసూలు చేయడం జరిగిందని తెలిపారు. సాకే రాజశేఖర్ అరెస్టు చేయడంతో పాటు అతని యొక్క ఆస్తుల వివరాలతో కూడిన వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సిల్వర్ కలర్ మొబైల్ ఫోన్ తో పాటు భూ సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రం అనగా ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు కోటి రూపాయలు, రెండు ప్రామిసరీ నోట్లు అనగా మొత్తం 10 లక్షల రూపాయలు లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిందితుడు సాకే రాజశేఖర్ పై ఇప్పటికే పలు మర్డర్ కేసులతో పాటు వడ్డీ వ్యాపార దాడుల కేసులు, క్రిమినల్ కేసులు (ధర్మవరం, పెనుకొండ తదితర ప్రాంతాలు) కూడా నమోదు కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే నిందితుడు సాకే రాజశేఖర్ పై రౌడీ షీట్ నెంబర్ 731 – ఏ కేసు నమోదు కావడం జరిగిందన్నారు. ఈ కేసులో ఇదివరకే కొంతమంది ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. అక్రమ వడ్డీ వ్యాపారం, దాడులు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని, అంతేకాకుండా పీడీ యాక్ట్ జిల్లా బహిష్కరణ కూడా చట్టపరంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ తరహాలో అక్రమ వడ్డీ వ్యాపారము, వేధింపులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్న ఎవరైనా బాధితులు భయపడకుండా నిరభ్యంతరంగా ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీసులకు సమాచారం తోపాటు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి పేరును గోప్యంగా ఉంచుతూ, పూర్తి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారని తెలిపారు. భయపడకుండా సంకోచించకుండా సహాయమును కోరాలని బాధితులకు డిఎస్పి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
అక్రమ వడ్డీ వ్యాపారస్తుడు సాకే రాజశేఖర్ అరెస్ట్
- Advertisement -
RELATED ARTICLES


