Homeజిల్లాలుఏలూరుచిరస్మరణీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి

చిరస్మరణీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు కున పోము రాజారత్నం

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిది అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కున పోము రాజారత్నం పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న వైయస్సార్ విగ్రహo వద్ద పట్టణ అధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పొన్నా రామచంద్రరావు అధ్యక్షతన రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారత్నం మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఎంతోమంది పేద ప్రజల గుండెచప్పుడు అయ్యాడని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడు అయ్యాడని కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని , మారుమూల గ్రామాలలో కూడా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దారం సత్తిరాజు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మద్దుకూరి బుచ్చిరాజు, సీనియర్ నాయకులు పాలి శ్రీనివాస్, తమిర్చి వెంకటేష్, ముప్పిడి కనిష్ట, ముప్పిడి రవి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు