ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బాపులదొడ్డి, బసలదొడ్డి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో మంగళవారం వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఆవరణంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, ముక్కరన్నలు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. జన హృదయనేతగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోతారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయేంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ యల్లప్ప, నాయకులు బ్రహ్మయ్య ఆచారి, అర్లప్ప,ధర్మరాజు, దస్తగిరి,ఏసన్న, ప్రసాద్, పరమేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


