Homeజిల్లాలుతూర్పు గోదావరిదోసకాయలపల్లిలో వినాయక చవితి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

దోసకాయలపల్లిలో వినాయక చవితి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

- Advertisement -

విశాలాంధ్ర – కోరుకొండ : కోరుకొండ మండలం దోసకాయల పల్లి గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని గురువారం గ్రామంలో నిర్వహించిన పలు వినాయక చవితి మండపాల ఊరేగింపు కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయా వినాయక మండపాల వద్ద ఆలయ కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావుకు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు, మండపాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ఊరేగింపు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరు ఆచరిస్తూ, వాటిని పరిరక్షించుకోవాలన్నారు.. పండుగలను ప్రతి గ్రామంలో కూడా కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. దోసకాయల పల్లి ప్రజలకు ఏ అవసరం వచ్చిన సహాయ, సహకారాలు అందిస్తానని అన్నారు. త్వరలోనే దోసకాయలపల్లిలో మహిళలకు పట్టు చీరల పంపిణీ చేస్తానని తెలిపారు. అనంతరం అచ్యుతాపురం గ్రామం ఎస్సీ పేటలో వినాయక ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు బత్తుల నానాజీ, దాసరి ధర్మరాజు, బత్తిన వీరాంజనేయులు, దోసపాటి సుబ్బారావు, దాసరి బాలు, మండే గౌతమ్, ఆయా మండపాల ఆలయ కమిటీ సభ్యులు, యువత, మహిళలు, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు