Homeఆంధ్రప్రదేశ్ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ని కలిసిన అల్లూరి జిల్లా ఎస్సీ ప్రతినిధులు

ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ని కలిసిన అల్లూరి జిల్లా ఎస్సీ ప్రతినిధులు

- Advertisement -

విశాలాంధ్ర-కొవ్వూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా, వి.ఆర్. పురం మండలం, బీసీ కాలనీ, వడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఎస్సీ కులానికి చెందిన పలువురు నాయకులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ సోమవారం కొవ్వూరులో ని ఆయన కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా సమాజంలో తాము ఎదుర్కొంటున్న వివక్షత, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనలో ఎదురవుతున్న ఇబ్బందులు, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం వంటి హక్కులు పూర్తిగా అందటం లేదని తాము పొందవలసిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయబడటం లేదని ఈ అంశాలపై తమకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ ఎస్ పి అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ చింగి విష్ణుమూర్తి, ఎమ్ఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వెంకన్న బాబు, నాయకులు మోదుగు నాగేశ్వరరావు, సందిపాము ఉషారాణి, ములకలపల్లి సరోజని తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు