Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపుట్టపర్తిలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది నిరసన..

పుట్టపర్తిలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది నిరసన..

- Advertisement -

తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ముఖ్యమంత్రికి విన్నపం

విశాలాంధ్ర పుట్టపర్తి :- సత్యసాయి జిల్లా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు పుట్టపర్తి రూరల్, అర్బన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి మున్సిపాలిటీ గ్రామ వార్డు సచివాలయాల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులు గత 15 రోజులుగా పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా ఎటువంటి హామీలు ఇవ్వకుండా ఉన్నందున అక్టోబర్ ఒకటవ తేదీ జరగబోయే పెన్షన్ పంపిణీ కార్యక్రమంపై సచివాలయ ఉద్యోగులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన సమయం ఉదయం 7 గంటలకి కాకుండా, జాబ్ చార్ట్ ప్రకారం సచివాలయం సిబ్బంది పనివేళలు అయినా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సచివాలయం వద్దనే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు.వృద్ధులు, వికలాంగులు నడవలేని స్థితిలో ఉన్నవారికి మాత్రం మానవతా దృక్పథంతో ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. త్యరలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.ఇంటింటికి తిరిగే సర్వేల నుంచి విముక్తి కలిగించాలని నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ మరియు పదోన్నతులు కల్పించాలని అదేవిధంగా ప్రొఫెషనల్ ప్రొబిషన్ ఆలస్యమైన కారణంగా తొమ్మిది నెలల బకాయిలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, అదేవిధంగా ఆరు సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసుకున్నవారికి ఆటోమేటెడ్ స్పెషల్ అడ్వాన్స్, స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి, శివ శంకర నాయక్, భాస్కర్ రెడ్డి రవీంద్ర నాయక్,రాజశేఖర్, మాలిక,మోహన్ కుమార,నరసింహులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు