సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థని కాపాడాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్
సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్డిటి కి సంబంధించిన ఎఫ్సీఆర్ ఏను రెన్యువల్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలములో గల ఆర్డిటి హాస్పిటల్ వారు సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి దశకములోనే పేదలకు సేవలు చేయడానికి మహారాష్ట్రలోని మన్మాడుకు 1952లోనే ఫాదర్ విన్సెంట్ పెర్రర్ వచ్చారని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు 1969 లో రావడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 సంవత్సరాలుగా విపరీతంగా అన్ని రంగాల్లోనూ సేవలందించిన ఆర్డీటీ సంస్థని ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సేవలందిస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధులు రాకుండా అడ్డుకోవడం బాధాకరమన్నారు. రామకృష్ణ తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవరగుడి జగదీష్, పుట్టపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవులు మాట్లాడుతూ పేదలకు సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థను కాపాడాల్సిన బాధ్యత అతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత కలదని వారు గుర్తు చేశారు. గత 50 సంవత్సరాలుగా పేదలకు వివిధ సేవలు అందిస్తున్న వాటి కార్యక్రమాలను ఆపడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, చేతి వృత్తుదారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కుళ్లాయప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి శ్రీనివాసులు,బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, సన్న పెద్దన్న, నాగభూషణ, ఓబులేసు, ఆదినారాయణ, శ్రీనివాసులు, రవీంద్ర, ఆదెప్ప, రామకృష్ణ,మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ, ఈరమ్మ, తదితరులు పాల్గొన్నారు.


