Homeజిల్లాలుకర్నూలుఎకరానికి 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

ఎకరానికి 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు : వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలంటూ మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకెఎస్, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి చంద్ర, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా రైతులు వేసిన పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. పత్తి, మిరప, ఉల్లి, ఆముదం పంటలు చేతికి రాక కుళ్ళిపోయాయన్నారు. ఉన్న పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక పోవడంతో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సినిమాకు రేట్లు పెంచుతున్నాడు గానీ రైతులు పండించిన పంటలకు గుగిట్టుబాటు ధర గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం 50 వేలు ఇవ్వాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్ ఐ జెర్మియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేష్, గోపాల్, గంగన్న, నర్సింహులు, నాగేంద్ర, రామాంజని, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు