Homeఆంధ్రప్రదేశ్అప్రమత్తంగా ఉండండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి

అప్రమత్తంగా ఉండండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి

- Advertisement -


విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి :  మొంధా తుపాన్‌ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కార్పొరేషన్‌ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆర్యాపురం నల్లా ఛానల్‌ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన చర్యలను ఆయనకు వివరించారు. నీట మునిగే ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించామని, 15 జేసీబీలు, నల్లా ఛానల్‌ వద్ద జనరేటర్లు సిద్ధం చేసామన్నారు. తుమ్మలావ, ఆర్యాపురం, లలితా నగర్‌, బీరువాల వీధి, రాజీవ్‌ గాంధీ కాలనీ, గాదిరెడ్డి నగర్‌, కంబాలచెరువు హైటెక్‌ బస్టాండ్‌ తదితర ప్రాంతాలు లోతట్టులో ఉన్నాయన్నారు. విద్యుత్‌ శాఖ తరపున 10 బృందాలు వెంటనే స్థంబాలు, చెట్లు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కమీషనర్‌, ఇతర అధికారులు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారని, కూటమి నాయకులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారన్నారు. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, పాలు, మంచినీరు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అవసరమైన మందులు కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించామని, మేజర్‌ డ్రైనేజీల్లో సిల్టును తొలగించడం జరిగిందన్నారు. పాఠశాలలకు శెలవులు ఇవ్వడం వల్ల విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా తల్లితండ్రులు చూడాలని కోరారు. కూటమి నాయకులతో పాటు అవసరమైతే తనకు కూడా ఫోన్‌ ద్వారా పరిస్థితిని వివరిస్తే వెంటనే తక్షణ చర్యలకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. అధికార యంత్రాంగం 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసారు. కూటమి నాయకులు, కార్పొరేషన్‌ అధికారులు ఆయన వెంట ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు