Homeఆంధ్రప్రదేశ్షష్టి మహోత్సవం

షష్టి మహోత్సవం

- Advertisement -

రంగ రంగ వైభవంగా సుబ్రమణ్య  షష్టి మహోత్సవం

విశాలాంధ్ర – సీతానగరం: రంగ రంగ వైభవంగా సుబ్రమణ్య  షష్టి మహోత్సవం. మండలంలో ముగ్గుళ్ళ గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వల్లీ దేవసేనా సుబ్రమణ్య స్వామి షష్టి మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఓ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఉదయం స్వామి వారికి పూజలు నిర్వహించి రకరకాల పూలతో సుందరంగా స్వామి వారిని, గుడి మండపాని అలంకరించామని. స్వామి వారి కళ్యాణం మొదలుకొని నవంబర్ 29న పుష్ప యగంతో షష్టి మహోత్సవం ముగియనున్నది అని అన్నారు. ఈ షష్టికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇంచార్జి, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నా సేన నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరలు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ సత్య కిషోర్, ఎస్ఐ రామ్ కుమార్, ట్రైనీ ఎస్ ఐ సురేష్ పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహణ సాగించారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనo చేసుకొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు