Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని చెకిచెర్ల గ్రామములో కొనసాగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామములోని భూ సర్వే పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు ఆ గ్రామ ప్రజలు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌడ్ నోటీసులు సక్రమంగా అందుతున్నాయా లేదా, రైతుల వద్ద ఉన్న పాస్ పుష్కాలను కూడా తాము పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ జాయింట్ ఎల్పీఎంలు ఉంచకుండా నిర్దేశించిన గడువులోపే గ్రౌండ్ ట్రూ థింగ్ సర్వే పనులను పూర్తి చేయాలని అక్కడి అధికారులకు సిబ్బందికి వారు ఆదేశించారు. భూ రికార్డులలో ఎటువంటి పొరపాట్లకు తాగు ఇవ్వరాదని తెలిపారు. రీ సర్వే పూర్తి అయిన తర్వాత ఆర్ఓఆర్ రైతులకు భూహక్కుల పరిరక్షణలో కీలక పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. భూ రికార్డుల స్పష్టతతో బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, వివిధ ప్రోత్సాహక పథకాలకు రైతులు సులభంగా అర్హత సాధించే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, ఎమ్మార్వో సురేష్ బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్, రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్లు, మండల, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

…రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం;! జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యము అని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని పోతుకుంట గ్రామాన్ని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో కలిసి వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు కుటుంబాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని పంచ సూత్రాల అమలు, పంటల సంరక్షణ, విత్తన ఎరువుల సరఫరా, రైతు భరోసా వంటి పథకాల ద్వారా సమగ్ర సాగు సదుపాయాలను అందిస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు సిబ్బంది పరిష్కరించాలని వారు ఆదేశించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నదని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ ,పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, ఆయా శాఖల అధికారులు, మహిళా సంఘాల నాయకురాలు, ఆదర్శ రైతులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు