బాల్య వివాహాలు అరికట్టేందుకు అందరి కృషి అవసరం
విశాలాంధ్ర – తాళ్లపూడి :సమాజం లో బాల్య వివాహాలు జరుగుతున్నప్పటికి అధికారులు గా అడ్డుకోలేక పోయిన పరిస్థితులు వున్నాయని, దీన్ని పూర్తిగా అరికట్టాలంటే కేవలం తల్లి వల్లే సాధ్యం అవుతుందని పలువురు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఐ.సి.డి.ఎస్ అద్వర్యం లో *బాల్య వివాహ ముక్త భారత్* అనే కార్యక్రమాన్ని తాళ్లపూడి మండల పరిషత్ కార్యలయం లో తాళ్లపూడి సెక్టార్ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా తహశీల్ధార్ లక్ష్మీ లావణ్య, ఎం.ఈ.ఓ బాలామణి, సీడీపీవో నాగలక్ష్మి, ఎంపీడీఓ వేణు గోపాలరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొని అవగాహన కల్పించారు. పిల్లల భవిష్యత్ బాగుండాలంటే పిల్లల పట్ల తల్లి శ్రద్ధ వ్యవహరించాలని, అప్పుడే చదువు కానీ వివాహం కానీ ఇతర సమస్యలు ఆన్నింటిని అధిగమించటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సమాచారం తెలిస్తే ఎవరిని ఉపేక్షించకుండా చట్ట రీత్యా చర్యలు కై భాద్యత తీసుకోవాలని హెచ్చరించారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ చేపట్టాలని హెచ్చరించారు. కార్యక్రమం లో ఐ.సి.డి.ఎస్ సూపరువైజర్ భాగ్య కుమారి టీచర్లు పాల్గొన్నారు.


