Homeఆంధ్రప్రదేశ్ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : దేవస్థానం అభివృద్ధి కి, ఆస్తుల పరిరక్షణ కు కృషి చేస్థామని శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు అన్నారు. నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వేంచేసి యున్న శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం నిర్వహించారు. ఉమా మల్లేశ్వర స్వామి దేవస్థాన  చైర్మన్  గొల్లపల్లి మురళి కృష్ణ పాలకవర్గ సభ్యులుగా భోగిరెడ్డి సుబ్బారావు, పులిమి సూర్యనారాయణ, సింగనపూడి మందేశ్వరరావు., అయినమిల్లి యేసు, గొలుగొండ వెంకటలక్ష్మి, తొంటపాక వెంకటలక్ష్మి, పుల్లేటికుర్తి కనకదుర్గ, కప్పల సుజాత, దేవస్థానం అర్చకులు, ఎక్స ఆఫీషియో మెంబర్ గా బాధంపూడి సూర్యనారాయణ మూర్తి లతో ఆలయ ఇనస్పెక్టర్ బి లక్ష్మీ నరసింహారావు, ఆలయ ఈఓ సోమాల శివ  ప్రమాణం చేయించిరి. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు అత్తిలి వెంకట రామన్, అత్తిలి సోమశేఖర్, తోరం వీరన్న,ఆకుల మోహనరావు, పందిరిపల్లి చిన్న మార్కండేయలు, పులిమి ముత్యాలరావు, మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ. జనసేన నాయకులు  ఆకుల సుబ్బారావు, యడ్లపల్లి సత్తిబాబు, బీజేపీనాయకులు తోరం జయ శ్రీనివాస్ పాల్గొని నూతనం గా ఎన్నిక కాబడిన పాలకమండలి సభ్యులను అభినందించిరి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు