Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మల కుమారి

విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం శ్రీ చింతలపాటి వర ప్రసాదమూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాకలపాటి నిర్మల కుమారి గురువారం తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలని పీహెచ్డీ,లేదా నెట్ లేదా స్లెట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కల అభ్యర్థులు డిసెంబర్ 28 వ తేదీ లోగా దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని అన్నారు.డిసెంబర్ 30 వ తేదీన అభ్యర్థులకు ముఖాముఖీ పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహించి ఎంపికైన వారికి అదే రోజు పోస్టింగ్ ఇస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు