ముదిగుబ్బ మండలం సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; ముదిగుబ్బ మండలములోని చుక్కల భూములను పరిష్కరించాలని, మండలంలో నెలకొన్న వివిధ సమస్యలపై పక్షాన పరిష్కార చర్యలు చేపట్టాలని ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ మహేష్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ మండలంలో 1954 ముందు అసైన్డ్ చేయబడిన చాలా పాత పట్టా భూములు అని , 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చబడి చుక్కలుగా నమోదు చేయబడి, 2018 నుంచి నేటి వరకు అవి రిజిస్ట్రేషన్ కు నోచుకోకుండా పోవడంతో సంబంధిత రైతులు తమ భూముల క్రయ విక్రయాల గురించి నానా ఇబ్బందు పడుతున్నారని తెలిపారు, కనుక గతంలో మాదిరి తక్షణమే అవి ఎటువంటి షరతులు లేకుండా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.గత వైసిపి ప్రభుత్వం లో ముదిగుబ్బకు కిలోమీటర్ దూరం లోనే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పటి వైసీపీ నాయకులు అక్రమంగా పట్టాలు పొందారని వివరించడం జరిగిందని,కదిరి బైపాస్ రోడ్డు వైపు దొరిగల్లు గ్రామ రెవెన్యూ పొలంలో 1359 సర్వే నంబరు లో 4.7oఎకరాలు అనంతపురం బైపాస్ కు సమీపంలో గుంజేపల్లి రెవెన్యూ పొలంలో
833 -14 సర్వే నెంబర్ లో 2,04 ఎకరాలు, కస్తూరిబాయ్ స్కూల్ సమీపంలోని 1189-4 సర్వే నెంబర్ లో 1 ఎకరా ప్రభుత్వ స్థలాన్ని అప్పటి వైసిపి నాయకులు ఆక్రమించుకొని లే అవుట్ వేశారన్నారు, కనుక తక్షణమే ఆయా భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు హిందూ స్మశాన వాటిక కూడా స్థలం కేటాయించాలని తెలిపారు.
మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఈ మండలంలో శాశ్వత తాసిల్దార్ లేకపోవడంతో రెవెన్యూ కార్యాలయంలో తమ వివిధ పనుల నిమిత్తమై కార్యాలయానికి వచ్చే ప్రజలు సకాలంలో తమ పనులు జరక్క ఇబ్బంది పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తక్షణమే ఈ మండలానికి ఒక సమర్థవంతమైన శాశ్వత తాసిల్దారు ను నియమించాలని కోరడం జరిగిందన్నారు.నూతనంగా ఏర్పడిన కస్తూరిబాయ్ కాలనీలోని ఇళ్లకు ఇంతవరకు డోర్ నెంబర్లు లేవని తక్షణమే అక్కడ ప్రతి ఇంటికి డోర్ నెంబర్లు కేటాయించాలని తెలిపారు
తదుపరి ఆర్డిఓఆర్డీవోకు స్పందిస్తూ ఈ సమస్యలను అన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని
హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ స్థానిక నాయకులు కుర్రా నాయుడు, రాధాకృష్ణ, లింగుట్ల ఆదినారాయణ, ఎల్ వెంకట్రాముడు, ఎల్ రామకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు,
చుక్కల భూములను పరిష్కరించండి..
- Advertisement -
RELATED ARTICLES


