- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బీహార్లో జరుగుతున్న జాతీయ సైకిల్ పోలో గేమ్ కు శ్రీ సత్య సాయి జిల్లా యశోద పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ టీమ్ కు ఎంపిక కావడం జరిగిందని యశోద స్కూల్ డైరెక్టర్ ఎం పృధ్వి రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సైకిల్ పోలో గేమ్ కు ఎంపికైన విద్యార్థులు లలో అశోక్ ,శ్రీనివాస్, శివ, సురేష్ ,అభిలాష్ ఉన్నారని తెలిపారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి రేవంత్ యశోద పాఠశాల ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ ఈ విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


