విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా ఉమాదేవి బాధ్యతలు స్వీకరించారు. వీరు గతంలో గోరంట్లలో విధులు నిర్వర్తించి ధర్మవరంకు బదిలీ కావడం జరిగింది. గతంలో ఉన్న ఎస్సై కేతన్న బదిలీపై ముదిగుబ్బకు బదిలీ చేశారు. అనంతరం ఉమాదేవి మాట్లాడుతూ పట్టణంలోని శాంతి భద్రతలకు అసాంఘిక కార్య కళాపాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని మహిళ భద్రతకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ఉమాదేవికి శుభాకాంక్షలు అని తెలియజేశారు.
టూ టౌన్ ఎస్ఐగా వీరేష్ బాధ్యతల స్వీకరణ;; పట్టణంలోని టూ టౌన్ ఎస్ఐ గా వీరేష్ బాధ్యతలను స్వీకరించారు. వీరు ఆకలి లో ఎస్సైగా పనిచేస్తూ బదిలీపై టూ టౌన్ ఎస్ఐగా రావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు చట్టప్రకారం అన్ని విధాల న్యాయం చేస్తామని తెలిపారు. తదుపరి టూ టౌన్ పోలీసులు వీరేసుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రూరల్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జే. రాజశేఖర్.;; మండలంలోని ధర్మవరం రూరల్ ఎస్సైగా జే. రాజశేఖర్ పదవి బాధ్యతలను స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న శ్రీనివాసులు విఆర్ కు వెళ్లారు. పిఎస్ లో ఎస్ఐగా నూతన బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ శిక్షణలో భాగంగా కొత్తచెరువు సోమందేపల్లి పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సమస్యాత్మకగ్రామాలపై ప్రత్యేక దృష్టి వహిస్తామని ,శాంతి భద్రతలకు వివాహము కలగకుండా చట్ట వ్యతిరేక కార్య కళాకారులపై దృష్టి సారిస్తామని తెలిపారు. నిష్పక్షపాతంగా గ్రామాల అభివృద్ధితో పాటు శాంతి భద్రతలను కాపాడుతానని వారు తెలిపారు.


