యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం;; స్థానిక ఎన్నికలలోపు కుల గణన నిర్వహించాలని యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని జయకృష్ణ స్వామి దేవస్థానంలో నియోజకవర్గ యాదవ సంఘం ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యాదవుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, కుల గణన అంశాలపై విస్తృతంగా చర్చ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని, హక్కుల సాధన కోసం ఐక్య పోరాటం చేయాలని, గ్రామస్థాయి నుంచి చట్టసభల వరకు సమతుల్య అవకాశాలు కల్పించాలని, బీసీలలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు తగిన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసప్ప యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ వివేక్ యాదవ్, యాదవ సాధికారిక అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ బిల్వంపల్లి కేశవ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బాల ఆంజనేయులు యాదవ్, నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలలోపు కుల గణన నిర్వహించాలి..
- Advertisement -
RELATED ARTICLES


