మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్
విశాలాంధ్ర-దుండిగల్:భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి సేవలు మరువలేనివని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల సందర్బంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ జిహెచ్ఎంసి పరిధి బౌరంపేట్ 295 డివిజన్ సింహపురి కాలనీలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తో పాటు ,సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు,జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాదవి, జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేశ్వర్,జిల్లా ఉపాధ్యక్షురాలు మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ,రాష్ట్ర ఎస్టీ మోర్చా శ్యామ్ రావ్, నల్ల రామచంద్రరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నాయకులు,ఎమ్మెల్యే చేతుల మీదుగా బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రక్తదాన శిబిరం ప్రారంభించి
ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా వాజ్ పేయి చిత్రపటానికి నివాళులు అర్పించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వాజ్ పేయి దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆ జన్మ బ్రహ్మచారి గా భరతమాత ముద్దుబిడ్డగా భారతరత్నగా కార్యదక్షుడుగా రాజనీతిఘ్నుడుగా దేశానికి చేసిన సేవలు అను నిత్యం దేశహితం కోసమే తపన,పోక్రాన్ అను ప్రయోగం చేసి ఒక్కసారి ప్రపంచానికి భారతదేశ పవర్ ఏంటో చూపించాడని తెలిపారు.ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రారంభించి గ్రామాలలో అభివృద్ధి వెలుగులు నింపిన వ్యక్తి.కార్గిల్ యుద్ధం లో సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పాకిస్తాన్ ను ఓడించడం ఇంకా అనేక గొప్ప గొప్ప నిర్ణయాలతో అన్ని పార్టీల నాయకుల మెప్పించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి అని కొనియాడారు. అలాంటి వ్యక్తికి శత జయంతి ఉత్సవాలు చేయడం అందులో పాల్గొనడం ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోనె మల్లారెడ్డి,ఎంబరి ఆంజనేయులు, సీతారాంరెడ్డి,తురాయి భానుగౌడ్,ప్రభాకర్ రెడ్డి,నర్సింహా చారీ,శ్రీనివాస్ యాదవ్,ఆకుల విజయ్ కుమార్, రోజా,అతీష్ బాబు,అందె అశోక్, క్యాసారం రాజు,సారా నవీన్,చిన్నా ముదిరాజ్,చింతకాయల నవీన్,
స్థానిక కాలనీ నాయకులు కార్యక్రమ సహాయకులు మురళి కృష్ణ,నల్ల రాజిరెడ్డి,ప్రమోద్ కుమార్,అశోక్ రెడ్డి,రామ్,రమణరెడ్డి,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


