Homeజిల్లాలుకర్నూలు20 లక్షలతో హలిగేరకు తాగునీటి సంపు నిర్మాణం

20 లక్షలతో హలిగేరకు తాగునీటి సంపు నిర్మాణం

- Advertisement -

ఎంపీ నాగరాజు హామీ
ఉహర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) :
హలిగేర గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ (సంపు)ను కచ్చితంగా నిర్మిస్తానని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చినట్లు జనసేన పార్టీ మండల కార్యదర్శి హనుమేష్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి జనాభాను దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పట్లో 40 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం గ్రామంలో 1400 కుటుంబాలు, సుమారు 3000 ఓటర్లు, 6000 పైచిలుకు జనాభా ఉండటంతో ఆ ట్యాంక్ ఏ మూలనూ సరిపోని పరిస్థితి నెలకొందని అన్నారు. ఫలితంగా గ్రామ ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగనాథ హల్లి వాటర్ స్కీం నుండి ప్రస్తుతం గ్రామపంచాయతీ ద్వారా నెలకు ఒక్కసారి మాత్రమే తాగునీరు అందుతుండటంతో గ్రామస్తులు నీటి కోసం అల్లాడిపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గత నెల రోజుల క్రితం హలిగేర గ్రామ తాగునీటి సమస్యను ఎంపీ బస్తిపాటి నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే సంపు నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్ తీసుకురావాలని ఎంపీ సూచించారని చెప్పారు. అందులో భాగంగా గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో కలిసి గ్రామంలో స్థల పరిశీలన చేపట్టి, సంపు నిర్మాణానికి 90 వేల లీటర్ల సామర్థ్యంతో అవసరమైన 19 లక్షల 45వేలు ఎస్టిమేషన్‌లను ఆర్డబ్ల్యూ అధికారులతో సిద్ధం చేసి గురువారం ఎంపీ నాగరాజుకు అందజేశామని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నాగనాథ హల్లి వాటర్ స్కీమ్ నుంచి గ్రామంలో తాగునీటిని నిల్వ చేసుకునేలా త్వరలోనే కొత్త వాటర్ స్టోరేజ్ ట్యాంక్ (సంపు) నిర్మాణం చేపడతామని ఎంపీ భరోసా ఇవ్వడంతో జనసేన నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు