వార్డ్ కౌన్సిలర్లు ధ్వజం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 40 వార్డులలో అధికారులు చేపట్టే ప్రతి కార్యక్రమము ఆ వార్డు కౌన్సిలర్లకు తెలియక పోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు కమిషనర్ సాయి కృష్ణ, ఇతర అధికారులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పట్టణంలో కౌన్సిలర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం చైర్పర్సన్ కాచర్ల లక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సమస్యలపై ఇంతవరకు పరిష్కారం చూపని సంబంధిత విభాగ అధికారులపై మరోసారి కౌన్సిలర్లు మండిపడ్డారు. అసలు కౌన్సిలర్లకు అధికారులు గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించే సాయికి దిగడం సిగ్గుచేటు అన్నారు. అనంతరం సాయి ప్రకాష్ అజెండాలోని 41 అంశాలను చదివి వినిపించారు. తదుపరి కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్ ,కోఆప్షన్ నెంబర్ రామకృష్ణలు మాట్లాడుతూ పట్టణంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతున్నాయో? ఎప్పుడు జరగటం లేదో? ప్రజలు చెపితే తప్ప మాకు తెలియటం లేకపోవడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. అదేవిధంగా రిజర్వుడ్ స్థలాల్లో మట్టిని కొంతమంది తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, గత సమావేశంలో చెప్పినా కూడా వాటికి పరిష్కారం చూపకపోవడంలో గుట్టు ఏంటి అని ప్రశ్నించారు. అదేవిధంగా మున్సిపల్ స్థలాలను కూడా కబ్జాలకు గురవుతున్న విషయాన్ని మరోసారి కమిషనర్ దృష్టికి తెచ్చారు. అధికారులు చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. వివిధ కార్యక్రమాలపై పెట్టిన ఖర్చుపై కౌన్సిలర్లు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అధికారులను అడుగగా, అధికారులు సమాధానాలు చెప్పలేక ఊరుకుండుపోవడం పద్ధతి కాదు అని తెలిపారు. అంతేకాకుండా పట్టణములో 12,000 మందికి పైగా లేఅవుట్లో ఇల్లు కట్టుకున్నారని వారికి చిరునామా లేకపోవడంతో బతకాలతో పాటు ఓటు తదితర హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది, వాటిపై వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని వారు మండిపడ్డారు. లే అవుట్లను మాత్రమే మున్సిపాలిటీలో కలపాలని వారు డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారి అలివేలమ్మ మాట్లాడుతూ కాలనీ విషయముపై కోర్టులో కౌంటర్ దాఖలు చేశామని కోర్టు నుంచి తీర్పు వచ్చేదాకా తాము చర్యలు చేపట్టలేమని తెలిపారు. అనంతరం అజెండాలోని అంశాలపై ఆమోదని నిర్ణయం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ శంషాద్ బేగం, మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ ఆర్ ఐ, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వార్డులో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వడంలో అధికారులు విఫలం..
- Advertisement -
RELATED ARTICLES


