సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోనీ కదిరి గేట్ నందుగల నేతన్న విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర క్యాలెండర్ ను చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏ డి వో లు, సుబ్బా నాయుడు, శీను నాయక్, చేతివృత్తుదారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారం లో కి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న కూడా చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను ఇంతవరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ప్రజలను మభ్యపెడుతూ, సమయాన్ని వృధా చేస్తున్నారే తప్ప ప్రజలకు మంచి జరిగే విధంగా పనిచేయడం లేదని ఆయన అన్నారు. చేనేత పరిశ్రమ చేనేత కార్మికుల మీద ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతోందన్నారు. అదేవిదంగా ఆగస్టు 7వ తేదీ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు, నేతన్న భరోసా కింద 25,000 వేల రూపాయలు, చేనేత కార్మికులకు 200 యూనిట్ల సబ్సిడీ కరెంటును, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు,పట్టణ నాయకులు శ్రీధర్, నల్లగుండ్ల శివ, చెన్నం పల్లి శ్రీనివాసులు, రాజా, కొండ, మల్లికార్జున, సోమందేపల్లి నారాయణస్వామి, శ్రీనివాసులు, మరియు మహిళా సమైక్య లీడర్స్,లలితమ్మ లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


