విశాలాంధ్ర – హిందూపురం : హిందూపురం రూరల్ పరిధిలోని పూలకుంట గ్రామములో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలకు మహిళలకు, సంక్రాంతి ముగ్గుల పోటీలు పూలకుంట గ్రామ సర్పంచ్ యన్. మంజునాథ్ ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సలహాదారులు డాక్టర్ సురేంద్ర హాజరయ్యారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాన్సిలేషన్ బహుమతులు అందించారు. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, రూ .5000, రూ.3000, రూ.2000 గా ప్రకటించి తొలి బహుమతి ప్రత్యూష, ద్వితీయ బహుమతి మైత్రి, తృతీయ బహుమతి హారిక లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రాము, వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెవిననహళ్లి ఆనందకుమార్, ఆదినారాయణ శివశంకర్ తదితర కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పూలకుంట లో సంక్రాంతి ముగ్గుల పోటీలు
- Advertisement -
RELATED ARTICLES


