విశాలాంధ్ర – హిందూపురం :పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో శుక్రవారం నూతన ఎటిఎం మరియు కాష్ డిపాజిట్ మిషన్ను అనంతపురం రీజినల్ మేనేజర్ ఐ. శ్రీనివాసులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులు ఎటిఎం, కాష్ డిపాజిట్ మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కెనరా బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక బ్యాంక్ మేనేజర్ బిందు శ్రీ, గణపతి, సుబ్బయ్య, డివిజనల్ మేనేజర్ ప్రసన్న కుమార్, మన్సూర్ అలీ, భాగ్య శ్రీ, హేమావతి, శ్రీలక్ష్మి, శ్రీదేవితో పాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
కెనరా బ్యాంక్ నూతన ఎటిఎం,కాష్ డిపాజిట్ మిషన్ ప్రారంభం
- Advertisement -
RELATED ARTICLES


