Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఅభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం..

అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం..

- Advertisement -

  • పార‌ద‌ర్శ‌క పాల‌న‌లో ఉద్యోగుల పాత్ర కీలకం
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విశాలాంధ్ర`విజయవాడప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌లందించ‌డంలో ఉద్యోగుల పాత్ర కీల‌క‌మ‌ని.. అంకిత‌భావంతో సేవ‌లందిస్తూ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లాను అగ్ర‌గామిగా నిలిపేందుకు అధికారులు, ఉద్యోగులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
ఏపీ ఎన్‌జీజీవో ఎన్‌టీఆర్ జిల్లా యూనిట్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్‌ను శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క‌లెక్ట‌రేట్‌లోని ఆయ‌న ఛాంబ‌ర్‌నందు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘ ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు నారా చంద్ర‌బాబు నాయుడు గారు వినూత్న కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తున్నార‌న్నారు. స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ ఏ 2047తో రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ముందుకెళ్తోంద‌ని.. ఈ ల‌క్ష్యాల సాధ‌న‌లో ఉద్యోగులు కీల‌క భాగ‌స్వాములు కావాల‌న్నారు. జీడీడీపీ, త‌ల‌స‌రి ఆదాయంలో వృద్ధితో పాటు ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచేందుకు, పేద‌రిక నిర్మూల‌న‌కు అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాలు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డంలోనూ ఉద్యోగుల సేవ‌లు ప్ర‌ధాన‌న‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.కార్య‌క్ర‌మంలో ఏపీ ఎన్‌జీజీవో జిల్లా అధ్య‌క్షులు డి.స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అప్ప‌గించిన విధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేయ‌డంలో ఎన్‌టీఆర్ జిల్లా ఉద్యోగులు ఎల్ల‌ప్పుడూ ముందుంటార‌న్నారు. న‌వ్య రాజ‌ధాని అమ‌రావ‌తికి గేట్ వే అయిన ఎన్‌టీఆర్ జిల్లాలో ఉద్యోగులు ప‌ని ఒత్తిడిని అధిగ‌మించి అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో ప్ర‌త్యేక దృష్టిపెట్టి జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి త‌మ‌వంతు స‌హ‌కారం అందిస్తార‌న్నారు. కీల‌క‌మైన ఈ జిల్లాలో ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌నితీరు మిగిలిన జిల్లాల‌కు ఆద‌ర్శంగా ఉండేలా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తామ‌ని పేర్కొన్నారు. మెగా ఈవెంట్లను విజ‌య‌వంతం చేయ‌డంలోనూ జిల్లా క‌లెక్ట‌ర్ వారి సార‌థ్యంలో స‌మ‌ష్టి కృషితో ముంద‌డుగు వేస్తామ‌ని స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి అన్నారు.కేలండ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఏపీ ఎన్‌జీజీవో ఎన్‌టీఆర్ జిల్లా స‌హాధ్య‌క్షులు వీవీ ప్ర‌సాద్‌, కార్య‌ద‌ర్శి పి.ర‌మేష్‌, కోశాధికారి వి.స‌తీష్‌కుమార్‌, కార్య‌వ‌ర్గ స‌భ్యులు జి.రామ‌కృష్ణ‌, వి.నాగార్జున‌, ఎండీ జానీ పాషా, కె.శివ‌లీల‌, సీహెచ్ మ‌ధుసూధ‌న‌రావు, సీహెచ్ శ్రీదేవి, న‌గ‌ర శాఖ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు సీహెచ్ సీవీఆర్ ప్ర‌సాద్‌, షేక్ న‌జీరుద్దీన్‌, కార్య‌వ‌ర్గ స‌భ్యులు రాజ‌శేఖ‌ర్‌, డీఎస్ఎన్ శ్రీనివాస్‌, బి.విజ‌య‌శ్రీ, రాంబాబు, ఎస్‌కే ఖాసిం సాహెబ్‌, సాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు