జిల్లా సెక్రెటరీ పూల ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో నిర్వహించిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ జూనియర్ విభాగంలో శ్రీ సత్య సాయి జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించిందని షూటింగ్ బాల్ జిల్లా కార్యదర్శి పూల ప్రసాద్ తెలిపారు. అనంతరం అనంతపురం జిల్లా కార్యదర్శి కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్రీడాకారులు మంచి ఆట తీరుని ఘనపరిచి మొట్టమొదటిసారిగా మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జట్టుకు పీఈటీలు ఉమాదేవి ప్రసన్నలక్ష్మి అరవిందులు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. తదుపరి షూటింగ్ బాల్ నిర్వాహకులు మూడవ స్థానం సాధించిన విద్యార్థినీలకు ట్రోఫీతో పాటు పత కాలను అందజేశారు. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సంజయ్ నగర్ లోని బి ఎస్ ఆర్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉండడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.అనంతరం క్రీడాకారులను పూల ప్రసాద్, లక్ష్మీనారాయణ, పిఈటిలు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
షూటింగ్ బాల్ లో తృతీయ స్థానమును కైవసం చేసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా జట్టు..
- Advertisement -
RELATED ARTICLES


