విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణములోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో నిర్మించనున్న శ్రీ లక్ష్మీ రథ మండపం (నూతన వాహనమంటపము) నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా స్వామివారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మంత్రి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శిథిలావస్థకు చేరుకున్న పాత వాహనమంటపాన్ని తొలగించి, భక్తుల సౌకర్యార్థం నూతన వాహనమంటపం నిర్మాణానికి తాను శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషకరం. స్వామివారి కరుణ, కటాక్షాలు ధర్మవరం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, రైతుల పంటలు ఎటువంటి విపత్తులు లేకుండా సమృద్ధిగా పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని, ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని స్వామివారు ఆశీర్వదించాలని వారు కోరారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి ప్రతి ఇంటా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
అనంతరం రైతుల సాగునీటి గురించి విలేకరులతో మాట్లాడుతూ రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన నీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. గతంలో జిల్లేడు బండ రిజర్వాయర్ నిర్మాణంలో రైతుల భూములను అనుమతి లేకుండా స్వాధీనం చేసుకొని, సరైన పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఆ రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించిన తరువాతే ఏ ప్రాజెక్టు అయినా ముందుకు వెళ్తాం అని స్పష్టం చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. మంత్రి లోకేష్, పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డి తదితరుల సహకారంతో ధర్మవరం అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అడహాక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ ఆలయ ఈవో. వెంకటేశులు, స్టూడియో రాము, పోరా ళ్ల ల్ల పుల్లయ్య బృందం, కొత్త హరి, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వాహనమంటప శంకుస్థాపన చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్
- Advertisement -
RELATED ARTICLES


