Homeజిల్లాలుఅనంతపురంప్రతి సిబ్బంది ఇంటింటి సర్వే కి వెళ్లాల్సిందే

ప్రతి సిబ్బంది ఇంటింటి సర్వే కి వెళ్లాల్సిందే

- Advertisement -

విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయడానికి కేటాయించిన ప్రతి ఉద్యోగి కచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్లాల్సిందేనని జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ డిప్యూటీ ఎంపీడీఓ అచ్యుత్ బాబు ఆదేశించారు. ఈనెల 19వ తేదీన విశాలాంధ్ర దినపత్రికలో నత్త నడకన ఏకీకృత కుటుంబ సర్వే ప్రతి ఇంటికి వెళ్లని సచివాలయ సిబ్బంది* అనే కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో రాప్తాడు మండల కేంద్రంలోని సచివాలయాలను ఆయన మంగళవారం సందర్శించి గ్రామాల్లోని ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలను కేటాయించిన యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ ఎంపీడీవో అచ్యుత్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు ఏకీకృత కుటుంబ సర్వేలో భాగంగా 14022 కుటుంబాల సర్వే పూర్తి చేస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు