Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

- Advertisement -

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

-రైతు సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం; గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుదించాలని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు గోడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమం మండల పరిధిలోని గరుడంపల్లి, ఉప్పునేసినపల్లి, గ్రామాలలో సిఐటియు, సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి ఉపాధి ప్రచార ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ 2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర ప్రభుత్వం, ఈ పథకం అమలు చేయడం జరిగిందన్నారు.ఈ పథకంలో, అత్యధిక మంది కూలీలు, పేద రైతులు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల పేదలు, వెనుకబడిన కులాల వారు, మైనార్టీలు, అగ్రకులాలకు చెందిన పేదలకు, ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు.ఈ పథకంలో మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలవుతుందన్నారు.ఇలాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే విధంగా చట్టాలు చేయడాన్ని సిపిఎం పార్టీ, సిఐటియు గా తీవ్రంగా ఖండిస్తున్నామని కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చిందని ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అధిక భారం పడుతుందని, పాత చట్టం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించే వారు అని తెలిపారు. కానీ కొత్త చట్టం వల్ల రాష్ట్రాలు 40 శాతం కేంద్రం 60 శాతం నిధులు భరించవలసి వస్తుందని అందువలన ఈ కొత్త చట్టాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శేషంపల్లి మారుతి, నరసింహారెడ్డి, చండ్రాయుడు,
సిఐటియు నాయకులు
ఎల్, ఆదినారాయణ,షాక్షావలి, ఉపాధి కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు