తహసిల్దార్ త్రివేణి..
విశాలాంధ్ర – డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని మండల తహసిల్దార్ త్రివేణి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల వ్యాప్తంగా ఉన్న ఆయా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆయా పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రధానంగా మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, మండల ఆర్ ఐ లు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


