Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక

జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక

- Advertisement -


విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపికలు విజయవంతంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సి. శీను, జిల్లా కార్యదర్శి జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానం నందు నిర్వహించడం జరిగింది అని, ఈ సెలక్షన్స్ కూ దాదాపుగా 80 మంది బాల బాలికలు పాల్గొనడం జరిగింది అని తెలిపారు. ధర్మవరం పట్టణం లోని జీవన్ జ్యోతి స్కూల్, కాకతీయ స్కూల్, యశోద స్కూల్, రిషి విద్యాలయ ఇంగ్లీష్ స్కూల్ ,జీవానంద ఉన్నత పాఠశాల,గాయత్రి ఇంగ్లీష్ మేడమ్ హై స్కూల్, వివిధ పాఠశాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులు పాల్గొన్నారు అని తెలిపారు. అదేవిధంగా పి ఈ టీ లు నాగేంద్ర, వీర, గణేష్, మనీ ,షేక్షావలి, ,అభిలాష్ ,జహీర్ ఖాన్, నరేష్ ,శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ సభ్యులు , బడిమల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన జిల్లా జట్టు ఫిబ్రవరి నెల లో జరిగేటువంటి సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ లో పాల్గొనడం జరుగుతుంది అని తెలిపారు.ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 14 అండ్15 తారీకు లోగుంటూరు జిల్లా బాపట్లలో జరుగుతుంది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు