.. ఎస్ఎఫ్ఐ ఏపీ ఎస్ ఎఫ్, రైతు సంఘం డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం: మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అధిక ఫీజుల దందాను అక్రమాలను ప్రశ్నించినందుకుగాను ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ యూనివర్సిటీ నాయకులు వినోద్ లను కిడ్నాప్ చేసి అతికిరాతకంగా కొట్టడాని ఖండిస్తూ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బండి శివ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న వంటి అక్రమాలను ప్రశ్నిస్తున్న వంటి ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టడం జరిగింది అన్నారు. ఈ సంఘటన జరిగి దాదాపు 5 రోజులు అవుతున్నప్పటికీ మోహన్ బాబు, మంచు విష్ణు లపై నామమాత్రపు కేసు పెట్టారు తప్ప వారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థుల పక్షాన ఉందనేది స్పష్టంగా అర్థం అవుతుంది తెలిపారు. యూనివర్సిటీలో అనేకమైన సమస్యల మధ్య విద్యార్థులుకొట్టుమిట్టాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విద్యార్థులు పక్షాన నిలబడి విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల ఫై దాడికి పాల్పడిన వారిని, అదేవిధంగా ఈ దాడికి ప్రధాన కారకులైన మోహన్ బాబు, మంచు విష్ణు లను తక్షణం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్ర హోం శాఖ మంత్రి స్పందించాలి లేనిపక్షంలో విద్యార్థి యువజన సంఘాలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బండి శివ, రైతు సంఘం మండల కార్యదర్శి ఆలకుంట మారుతి ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అమన్ శ్రీనాథ్ బాలాజీ సాయి చరణ్ ప్రణీత్
తదితరులు పాల్గొన్నారు.
మోహన్ బాబు, మంచు విష్ణుని తక్షణం అరెస్టు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


