Homeజిల్లాలుఅనంతపురంపన్నుల వసూళ్లతో గ్రామాల అభివృద్ధి

పన్నుల వసూళ్లతో గ్రామాల అభివృద్ధి

- Advertisement -

. ఎంపీడీఓ బి.విజయలక్ష్మి

​విశాలాంధ్ర-రాప్తాడు : ఇంటి పన్నుల వసూళ్లతో గ్రామాలను కొద్దిమేర అభివృద్ధికి వినియోగించుకోవచ్చని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లపై గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశోక్ బాబు,వ్ పంచాయతీ అభివృద్ధి అధికారి శమంతకమణి,వ్ సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా అధికారులు గ్రామస్థులకు పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించారు. పంచాయతీ అభివృద్ధికి పన్నుల చెల్లింపు కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామ ప్రగతికి సహకరించాలని కోరారు. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు