Homeరంగంలోకి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’

రంగంలోకి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’

- Advertisement -

ఇరాన్ దాడులు తీవ్రతరం

. అమెరికా, ఇజ్రాయిల్‌కు దడ
. ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి
. దుబాయ్ విమానాశ్రయం మూసివేత
. తెలఅవీవ్‌ను తాకిన క్షిపణులు… విధ్వంసం
. తెహ్రాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్
. కీలక విమానం, సైనిక స్థావరాలు నేలమట్టం

తెహ్రాన్/టెలఅవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో బాంబులు మోతలు, మిసైళ్ల వర్షం కొనసాగుతున్నాయి. యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. యుద్ధం మొదలై పదిహేడు రోజులవుతున్నా… ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ.. అటు ఇరాన్ గానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకు పడుతున్నాయి. కాగా ఇరాన్ ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో పాటు అత్యాధునిక క్షిపణులతో విరుచుకుపడు తోంది. ఈ యుద్ధంలో తొలిసారి డ్యాన్సింగ్ మిసైల్‌ను వినియోగించింది. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని సెజ్జిల్ క్షిపణిని ప్రయోగించింది. దీని రేంజి 2,000 కిలోమీటర్లకుపైగా ఉండగా.. 700 కిలోల వార్ హెడ్‌ను మోసుకెళ్లగలదు. దీంతో అమెరికా, ఇజ్రాయిల్ ఆందోళనలో పడ్డాయి. కాగా, సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు చేసింది. ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీస్ జారీచేశారు. అంతేగాక పలు విమానాలను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. సమీపంలోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన ట్యాంక్‌పై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన డజన్ల కొద్దీ క్షిపణులు ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్‌ను తాకాయి. ఈ దాడుల వల్ల నగరంలోని రహదారులు ధ్వంసం కాగా… వందలాది కార్లు మంటల్లో ఆహుతయ్యాయి. క్షిపణులు పడిన చోట భారీ గోతులు ఏర్పడటం ఈ దాడి తీవ్రతను తెలియజేస్తోంది. కాగా దాడుల్లో ప్రాణ నష్టం వివరాలపై ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.
ఇజ్రాయిల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్… అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత
ఇరాన్‌పై ఇజ్రాయిల్ మరోసారి విరుచుకుపడింది. తెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఇరాన్ అగ్ర నాయకత్వం ఉపయోగించే ఒక కీలక విమానంతో పాటు పలు సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) పేర్కొంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు తెలిపింది. ధ్వంసమైన విమానం ఎయిర్‌బస్ ఏ340. దీనిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, గతంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి అగ్ర నాయకులు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు. టెహ్రాన్‌లోని ఈ విమానాశ్రయంలో దేశీయ విమానాలతో పాటు ఇరాన్ వైమానిక దళానికి చెందిన సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో తెÉహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ వంటి ఇతర నగరాల్లోని మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. మరోవైపు, ీVAర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచే విషయంలో అమెరికాకు మిత్రదేశాలు సాయం చేయకపోతే నాటో భవిష్యత్తు ‘చాలా దారుణంగా’ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ీీVAర్ముజ్ జలసంధి ద్వారా యూరప్ దేశాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని, కాబట్టి అక్కడి భద్రతకు వాళ్లు కూడా బాధ్యత వహించాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా గతంలో యూరప్‌కు సాయం చేసిందని, ఇప్పుడు వారు తమకు సాయం చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన వాదించారు.
మొదటిసారిగా సెజ్జిల్ క్షిపణులు
యుద్ధంలో ఇరాన్ తొలిసారి 1.5 టన్నుల వార్‌హెడ్‌లతో కూడిన ‘సెజ్జిల’ క్షిపణులను ప్రయోగించింది. 17వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సెజ్జిల్‌ను ఆపడం ఐరన్‌డోమ్‌కు సవాల్‌గా మారింది. ఆదివారం వేకువజామున యూఏఈ, సౌదీ, కువైట్, జోర్డాన్‌లోని నాలుగు అమెరికా ఎయిర్‌బేస్‌లపై దాడులు చేశామని ఉపగ్రహ చిత్రాల ప్రకారం అమెరికా స్థావరాల్లోని 80 శాతం వ్యూహాత్మక రాడార్లు ధ్వంసమయ్యాయని ఇరాన్ ప్రకటించింది. మొత్తంగా 200 శత్రు వ్యూహాత్మక పాయింట్లపై దాడి చేసినట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. నాలుగు థాడ్ వ్యవస్థలు, 18నౌకలు చమురు ట్యాంకర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధానికి ఒక రోజు అమెరికా 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని తెలిపింది. దుబాయ్, దోహాల్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. మధ్య ఇజ్రాయిల్‌లోని రామత్ గాన్ వీధిలో ఇరానియన్ క్షిపణి పడింది. బ్నీబ్రాక్ ప్రాంతంలో క్షిపణి తాకిడికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. అనేక మంది ఇజ్రాయెలీలు గాయపడినట్లు సమాచారం. టెలఅవీవ్‌లో ఇరాన్ క్షిపణులు పడి అనేక కార్లు ధ్వంసం అయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు