విశాలాంధ్ర ధర్మవరం;;తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మే నెల 14వ తేదీన బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ కు రానున్నారని తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్నారని తెలిపారు. కావున ధర్మవరం పట్టణ, రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎర్రగుంట సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పట్టణ, రూరల్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు వాటి ఇన్చార్జులు వార్డ్ కమిటీ సభ్యులు బూత్ కన్వీనర్లు తెలుగు యువత తెలుగు మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు సంఘాల నాయకులు కార్యకర్తలు, ప్రతి ఒక్కరు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ధర్మవరం ఎర్రగుంట సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.
14న రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బత్తలపల్లి కి రాక
- Advertisement -
RELATED ARTICLES


