ఆల్ ఇండియాలో 2653 ర్యాంకు సాధించిన విజయ్ సాహుల్
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో ధర్మవరం పట్టణానికి చెందిన విజయ్ సాహుల్ ఆల్ ఇండియాలో 2653వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కు చెందిన సన్ కంప్యూటర్ వ్యవస్థాపకులు సూర్యనారాయణ, సునీతల కుమారుడు విజయ్ సాహుల్ విజయవాడలోని నారాయణ కాలేజీలో ప్రత్యేక శిక్షణ పొందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో జేఈఈ మెయిన్స్ కోసం ప్రత్యేక శిక్షణతో పాటు ప్రతిరోజు 8 గంటల పాటు జేఈఈ మెయిన్స్ కోసం కష్టపడడం జరిగిందని విద్యార్థి విజయ్ సాహుల్ తెలిపారు. దీంతో విద్యార్థి విజయ సాహుల్ ను తల్లిదండ్రులతోపాటు, పలువురు శ్రేయోభిలాషులు స్నేహితులు ప్రత్యేకంగా అభినందించారు.
జేఈఈ అడ్వాన్స్ లో సత్తా చాటిన ధర్మవరం విద్యార్థి
- Advertisement -
RELATED ARTICLES


