Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావత్సవాయిలో బ్రహ్మని భారత్ గ్యాస్ కష్టాలు

వత్సవాయిలో బ్రహ్మని భారత్ గ్యాస్ కష్టాలు

- Advertisement -

వినియోగదారులకు అందనంత దూరంలో భారత్ గ్యాస్
గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ లో సేల్
గ్యాస్ కంపెనీలో నో ఫోన్ పే నో స్కానర్

విశాలాంధ్ర- వత్సవాయి:వంట గ్యాస్‌ సమస్య రోజురోజుకూ మండలం లొ పెరుగుతోంది. ఇప్పటికే సిలిండర్‌ కోసం చాలామంది వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరుగు తున్నారు వత్సవాయి మండలంలోని బ్రహ్మణి భారత్ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను చవిచూస్తున్నారు …….. బుక్ చేసుకుని ఎన్ని రోజులు అవుతున్న గ్యాస్ బండలు రాకపోవడంతో పోలంపల్లిలోని గోడౌన్ వద్దకు జనాలు బారులు తీరుతున్నారు… ఇది అదునుగా భావించిన గ్యాస్ కంపెనీ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు గ్యాస్ వినియోగదారులు తమ తమ వాహనాలలో గ్యాస్ కంపెనీకి వెళ్లి చూడగా పరిమిత సంఖ్యలోనే బండలు ఉండడంతో చేసేదేమీ లేక మరల తిరిగి వెళుతున్నారు గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరిపడా బండలు రావా? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు బ్రహ్మణి భారత్ గ్యాస్ యాజమాన్య నిర్వహణ లోపంతోని ఇదంతా జరుగుతుందని పలువురు అంటున్నారు గ్యాస్ బండలు తీసుకోవడానికి జనాలు కంపెనీ వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది ఎట్టకేలకు గ్యాస్ బండ తీసుకొని డబ్బులు చెల్లించడానికి ఫోన్ పే కానీ స్కానర్ ద్వారా గాని డబ్బులు చెల్లిస్తామని వినియోగదారులు తెలపడంతో గ్యాస్ బండ కార్యాలయంలో పెట్టి బయటకు వెళ్లి ఎక్కడైనా డబ్బులు తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తే మాత్రమే బండ ఇస్తామని గ్యాస్ సిబ్బంది చెప్పడంతో బయటకు వెళ్లి డబ్బులు తీసుకుని వచ్చే సమయానికి గ్యాస్ బండలు అయిపోయాయి అనే సమాధానం వినియోగదారుడికి మిగులుతుంది ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ జరిపి గ్యాస్ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని బ్రహ్మణి భారత్ గ్యాస్ వినియోగదారులు కోరుతున్నార-

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు