Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపోతులనాగేపల్లిలో ఇంటింటికీ వెళ్లిన పరిటాల శ్రీరామ్

పోతులనాగేపల్లిలో ఇంటింటికీ వెళ్లిన పరిటాల శ్రీరామ్

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం ;కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం మండలం పోతులనాగేపల్లిలో ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి.. రెండేళ్లలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పథకాల విషయంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల పింఛన్లు, తల్లికి వందనం పథకంకి సంబంధించిన కొన్ని సమస్యలను శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వాటి గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. గ్రామంలో సమస్యల గురించి కూడా శ్రీరామ్ అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లలో తమకు పథకాలు బాగా అందాయని.. పాలన కూడా బాగుందన్న అభిప్రాయం కనిపించింది. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ రెండేళ్లలో తాము చేసిన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కేవలం చేసింది మాత్రమే చెప్పకుండా సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నామన్నారు. 45రోజుల పాటు మా పార్టీ శ్రేణులు మొత్తం ప్రజల్లోనే ఉంటామన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ ను కలుసుకుంటామన్నారు. ప్రజల్లో మా పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సుమారు 10లక్షల కోట్లకు పైగా అప్పు ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి వైపు నడిపించడం అంత సులువైంది కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ.. ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నారని.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అందుకే ప్రజలు తమ పాలనకు మద్దతు చెబుతున్నారని శ్రీరామ్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు