Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహాస్టల్ సమస్యలు తీర్చండి..

హాస్టల్ సమస్యలు తీర్చండి..

- Advertisement -

యువసేన స్టూడెంట్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు అరుణ్ తేజ
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో గల ఎస్సీ హాస్టల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రీవెన్స్ డే సందర్భంగా ఏఎస్ఓడబ్ల్యూ శ్రీరామ్ నాయక్ కు వినతి పత్రాన్ని యువసేన స్టూడెంట్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ తేజ ,వివేక్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్ లో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలు వెంటనే తీర్చే లాగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారి రెండు రోజుల లోపల సమస్యలను పరిష్కారం చేస్తానని వారు హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఏ సమస్యలు వచ్చినా కూడా పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలను వైయస్ఎఫ్ విద్యార్థి సంఘం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చరణ్ తేజ, నాని, రాజా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు