యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం
ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో ఆగస్టు 2వ తేదీన నిర్వహించబడే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరం యువర్ ఫౌండేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో దాతలుగా చందా సావిత్రమ్మ, చందా ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కంటి వైద్య చికిత్సలతో పాటు కంటి ఆపరేషన్, ఉచిత రవాణా , ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ రాధాకృష్ణ, క్యాంపు చైర్మన్ రామాంజనేయులు, డాక్టర్ బి వి సుబ్బారావు, ఓ వి ప్రసాద్, వి ఆర్ సి గుప్తా, చాంద్ బాషా, వై కే శ్రీనివాసులు, బండపల్లి రంగనాథ్, గర్రె రమేష్ బాబు, కృష్ణమూర్తి, సుంకు సుకుమార్, బండి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


