విశాలాంధ్ర – సోమందేపల్లి: మండల పరిధిలోని చాలకూరు గ్రామ సమీపంలో బుధవారం రాత్రి రైల్వే గేట్‌మెన్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రొద్దం మండలం కళ్లకుంట గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ (41) చాలకూరు రైల్వే గేటు వద్ద గేట్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో రైల్వే గేటు మూసివేసిన అనంతరం సమీపంలోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడికి భార్య ఉన్నారు. వివాహమై ఏడేళ్లు గడిచినా సంతానం కలగకపోవడం, కుటుంబ సమస్యలు, అధిక అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ పెనుకొండ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చాలకూరు వద్ద రైల్వే గేట్‌మెన్ ఆత్మహత్య..
- Advertisement -
RELATED ARTICLES


