విద్యార్థుల సంఖ్య పెంపుదల పట్ల ఎంఈవోలు ఘన సన్మానం
విశాలాంధ్ర ధర్మవరం;; నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వెనుకంచి ఉన్న దశలో, ఓ యువ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తనదైన శైలిలో పట్టు వదలని విక్రమార్కుడిలా తన పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను పెంచుకొని నిజమైన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నేడు ధర్మవరంలో గుర్తింపు పొందారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు పట్ల ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గత సంవత్సరం పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల సెంట్రల్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల కేవలం 11 మందితో నూతన డీఎస్సీ ద్వారా నిమ్మల హేమంత్ బాబు టీచర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి, నాణ్యమైన విద్యను అందించడంతో తల్లిదండ్రుల వద్ద మంచి గుర్తింపు పొందారూ. దీంతో 2026 మే నెల నుంచి జూన్ వరకు తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులతో ఇంటింటా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్న ప్రచారం జోరుగా కొనసాగింది. దీంతో జులై 2026 నాటికి 11 నుంచి 51 విద్యార్థుల సంఖ్య పెరగడంతో, ఆయన సంతోషానికి హద్దు లేకుండా వెళ్ళింది. ఇది గుర్తించిన ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ మరొక టీచర్ ని అక్కడకు బదిలీ వేశారు. దీంతో ప్రత్యేక దృష్టితో, ప్రత్యేక లక్ష్యంతో ఉపాధ్యాయుడు హేమంత్ బాబు తనదైన శైలిలో నాణ్యమైన విద్యను అందించుటలో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆ ఉపాధ్యాయుని ఘనంగా సన్మానిస్తూ, మీ పాఠశాలకు ఏ సమస్యలున్న మాకు తెలియజేసే తప్పక పరిష్కరించే దిశలో తాము ఉన్నాము అని భరోసా కల్పించారు. హేమంత్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు మరొక ఉపాధ్యాయులను నియమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పట్టు వదలని విక్రమార్కుడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హేమంత్ బాబు
- Advertisement -
RELATED ARTICLES


