Homeజిల్లాలుఅనంతపురంపొలం పిలుస్తోంది కార్యక్రమంలో పంటల యాజమాన్యంపై అవగాహన…

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పంటల యాజమాన్యంపై అవగాహన…

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని చామలూరు, కేశేపల్లి , దుగుమర్రి గ్రామాలతో పాటు మండల కేంద్రంలో నిర్వహించిన “పొలం పిలుస్తోంది” కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు.వేరుశనగ, కంది పంటల్లో తేమ ఒత్తిడిని తగ్గించేందుకు పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని, కంది, ఆముదం పంటల్లో అధిక మొక్కల సాంద్రత ఉన్న చోట థిన్నింగ్ చేపట్టాలని సూచించారు. అంతరకృషి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించుకోవచ్చని తెలిపారు.నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా మినుములు, పెసర వంటి తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి సి. చన్నవీరస్వామి రైతులకు సూచించారు. రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)లో నమోదు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ సి. చన్నవీరస్వామి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ ప్రసాద్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. కిషోర్, డా. సుధారాణి, డా. చందన, కళాశాల సిబ్బంది డా. కవిత, డా. సుస్మిత, రైతు సేవా కేంద్రం సిబ్బంది పోతులయ్య, దివ్యభారతి, సరస్వతి, సృజన, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు