Homeజిల్లాలుఅనంతపురంతమ్ముడిపై హత్యాయత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

తమ్ముడిపై హత్యాయత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

- Advertisement -

విశాలాంధ్ర – ఉరవకొండ: సొంత తమ్ముడిపై కారుతో ఢీకొట్టి, అనంతరం హాకీ స్టిక్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో పెద్ద కౌకుంట్ల గ్రామానికి చెందిన మోపిడి రాము (29)ను అరెస్ట్ చేసినట్లు ఉరవకొండ సీఐ మహానంది, ఎస్‌ఐ జనార్దన్ నాయుడు తెలిపారు. బుధవారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. ఆగస్టు 1న తెల్లవారుజామున వై.రాంపురం–కౌకుంట్ల రోడ్డులో బాధితుడు మోపిడి శేఖర్ (26) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, రాము కారుతో ఢీకొట్టి అనంతరం హాకీ స్టిక్‌తో తలపై దాడి చేయడంతో శేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. బాధితుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నం.137/2026 కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 109 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం చిన్నముష్టూరు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన కారు, హాకీ స్టిక్‌తో పాటు మూడు కరెంట్ ఫ్యూజులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు