Homeఆంధ్రప్రదేశ్‘రెవెన్యూ’ సమస్యలకు సత్వర పరిష్కారం

‘రెవెన్యూ’ సమస్యలకు సత్వర పరిష్కారం

- Advertisement -

మంత్రి అనగాని సత్యప్రసాద్
విశాలాంధ్ర-సచివాలయం: వీఆర్వో, వీఆర్‌ఎ, సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రవీంద్రరాజు సారధ్యంలో వివిధ సంఘాల నేతలు శుక్రవారం మంత్రిని కలిశారు. సమస్యలు వివరించారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు ప్రమోషన్ చానెల్లో రేషియో పెంచాలని, వీఆర్‌ఎలకు పేస్కేల్ వర్తింపజేసి గతంలో నిలిపివేసిన డీఏను పునరుద్ధరించాలని కోరారు. సర్వేయర్ల వేతనాలు పెంచాలని, వారికి డైలీ, ట్రావెల్ అలవెన్సులు ఇవ్వాలన్నారు. డిమాండ్లపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం చర్చించి, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. ఇప్పటికే వీఆర్‌ఎలు ఆందోళన బాట పట్టారని, సర్వేయర్లు కూడా సహాయ నిరాకరణకు నోటీసులు ఇచ్చారని, వీఆర్వోలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని రవీంద్రరాజు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా చర్చలు జరిపి… సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు